Wednesday, November 13, 2024

TG | హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్.. భారీ వర్ష సూచన

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకుపోయాయి. కాగా, రాత్రికి మరింత కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

నగరంలో భారీగా వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. ఏదైనా సహాయం కోసం 040 21111111కు ఫోన్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. లక్డీకపూల్, ఖైరతాబాద్, అమీర్ పేట, ఖాజాగూడ జంక్షన్, మల్కంచెరువు, బయోడైవర్సిటీ కూడలి, ఐకియా జంక్షన్, గచ్చిబౌలి త‌దిత‌ర‌ ప్రధాన రహదారులపై వాహనాలు బారులు తీరాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement