హైదరాబాద్, ఆంధ్రప్రభ: యూనివర్సిటీలు, కాలేజీల్లో ప్రాక్టీస్ ప్రొఫెసర్లను నియమించేందుకు వీలుగా యూజీసీ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈమేరకు యూనివర్సిటీలు, కాలేజీలకు సోమవారం యూజీసీ లేఖ రాసింది. విద్యార్థులకు బోధించేందుకు డిగ్రీతో సంబంధంలేకుండా వివిధ వృత్తి, వ్యాపారాల్లో అనుభవజ్ఞులైన అభ్యాసకులు, నిపుణులు, పరిశ్రమ నిపుణులతో బోధించేలా మార్గదర్శకాలను రూపొందించింది. దీనికనుగుణంగా చర్యలు తీసుకోవాలని వర్సిటీ, కాలేజీలకు యూజీసీ లేఖ రాసింది. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, కాలేజీల ప్రిన్సిపాల్స్ తమ సంస్థల్లో ప్రాక్టీస్ ప్రొఫెసర్లను నియమించుకోవాలని సూచించింది. దీనికి వీలుగా నియమ నిబంధలను మార్పులు చేర్పులు చేసుకోవడానికి చర్యలు చేపట్టాలని యూజీసీ సూచించింది.
- Advertisement -