హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ వైద్య విద్యా డైరెక్టర్ పరిధిలో కొత్త పోస్టులు మంజూరయ్యాయి. కాంట్రాక్టు పద్దతిలో ఏడాదికాలానికిగాను ప్రొఫెసర్, అసోసి యేట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ కానున్నాయి. వైద్య విద్యలోని మొత్తం 16 విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు డీఎంఈ తెలిపారు. పోస్టుల భర్తీకి ఈ నెల 12న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
అదే రోజున అర్హుల జాబితాను విడుదల చేయనున్నారు. ఎంపికైన తర్వాత 23తేదీ నాటికి విధుల్లొ చేరాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సైన్సె స్ వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు సూచించారు.