దేశీయ ఐటీ దిగ్గజం విప్రో.. ఫ్రెషర్స్‌కు శుభవార్త అందించింది. ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ ప్రోగ్రాం కింద 2020, 2021, 2022లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన, పూర్తి చేయనున్న వారి నుంచి దరఖాస్తులను ఆహానిస్తోంది. అప్లికేషన్ చివరి తేదీ జనవరి 31. దరఖాస్తుకు 25 ఏళ్ల వయస్సు పరిమితిని విధించింది. ప్రాజెక్టు ఇంజినీరింగ్ పోస్టుకు సంవత్సరానికి రూ.3.5 లక్షల వేతనం అందించనున్నారు.
బీఈ/బీటెక్ (కంప్యూటర్ డిగ్రీ), ఎంఈ/ఎంటెక్ (5ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు), ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ ఇంజినీరింగ్, అగ్రి కల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ మినహా ఇంజినీరింగ్‌లో అన్ని బ్రాంచ్‌ల వారికి అర్హత కల్పించింది. ఉత్తీర్ణత శాతం 60 శాతం అంతకంటే ఎక్కుడా ఉండాల్సి ఉంటుంది. 2022లో పాసై.. 12వ తరగతిలో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి. నేపాల్, భూటాన్ దేశస్తులు వారి పౌరసత ధ్రువపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. గడిచిన 6 నెలల్లో విప్రో నిర్వహించిన సెలక్షన్ పద్ధతిలో పాల్గొన్న అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital