Saturday, November 23, 2024

రికార్డు స్థాయిలో కరెంటు వాడకం.. ఒక్క రోజే 13,742 మెగావాట్ల వినియోగం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగింది. శనివారం ఒక రోజే మధ్యాహ్నాం వరకు 13,742 మెగావాట్ల పీక్‌ డిమాండ్‌ పెరిగిందని టీఎస్‌ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత పేరిగే అవకాశం ఉందని శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధిక పీక్‌ డిమాండ్‌ను అధిగమించామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే అత్యధిక డిమాండ్‌ అని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది 14,500 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సైతం భారీగా విద్యుత్‌ వినియోగం పెరిగిందన్నారు. గతేడాది గ్రేటర్‌లో 55 మిలియన్‌ యూనిట్స్‌ దాటని విద్యుత్‌.. ఈసారి ఆర్చిలోనే 65 మిలియన్‌ యూనిట్స్‌ పెరిగిందని ప్రభాకర్‌రావు తెలిపారు.

విద్యుత్‌ సమస్యల ఫిర్యాదులపై మొబైల్‌ పోర్టల్‌..

రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి ఒక ప్రత్యేక యాప్‌ను అధికారులు ప్రారంభించారు. విద్యుత్‌ సరఫరాలో సమస్యలు, ఇతర వాటిని పరిష్కరించడానికి వినియోగదారలు కన్సూమర్‌ గ్రీవెన్స్‌ సెల్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం అవుతోందని వినియోగదారుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో విద్యుత్‌ వినియోగదారుల నుంచి మరింత సులభతరమైన పద్దతితలో పిర్యాదులు స్వీకరించడానికి వెబ్‌, మొబైల్‌ అదారిత పోర్టల్‌ను అధికారులు అమల్లోకి తీసుకురానున్నారు. ఈ నెల 28న రెడ్‌హిల్స్‌లోని సింగరేణి భవన్‌లో ఈ సరికొత్త పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు ఈఆర్‌సీ కార్యదర్శి ఉమాకాంత పాండ ఒక ప్రకటనలో తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement