ప్రభన్యూస్ : ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ వాంగ్మూలాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసింది. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన కేసులో ఈ మేరకు ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నది. మూడుసార్లు సమన్లు జారీచేసిన తర్వాత డిసెంబర్ 3న పరంబీర్ ఈడీ అధికారుల ముందుకు వచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారి సమక్షంలో కొద్దిగంటలపాటు ప్రశ్నించారు.
ప్రస్తుతం దేశ్‌ముఖ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. నవంబర్ 2న ఈడీ అధికారుల విచారణకు హాజరైన తర్వాత అతనిని అరెస్టు చేసింది. అంతకు ముందు ఈ కేసులో ఈడీ దేశ్‌ముఖ్‌కు ఐదుసార్లు సమన్లు జారీచేసింది. నెలకు 100 కోట్ల రూపాయల వసూళ్ల ఆదేశాలకు సంబంధించిన ఆరోపణల కేసులో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో గతంలో దేశ్‌ముఖ్ పీఏ, పీఎస్‌లను అరెస్టు చేసిన ఈడీ, ఆయన కుమారుడు హృషికేశ్‌కు కూడా సమన్లు పంపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital