Saturday, November 23, 2024

గ్రూప్‌1కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు.. 4లక్షలకు చేరువలో అభ్యర్థులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రూప్‌-1కు భారీగా దరఖాస్తులు అందాయి. మే 31తో ముందస్తు గడువు ముగియడంతో అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు తుదిగడువును ఈనెల 4 వరకు పొడిగించిన నేపథ్యంలో భారీగా గ్రూప్‌-1కు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి ఏపీలో 2011లో వెలువడిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు 3,02,912 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, స్వరాష్ట్రం తెలంగాణలోనే దాదాపు 4 లక్షల వరకు దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు పోస్టులు కూడా తక్కువే. 312 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ వెలువడింది.

కానీ ప్రస్తుతం 503 గ్రూప్‌-1 పోస్టులకుగానూ శనివారం రాత్రి 10 గంటల వరకు 3,78,238 మంది దరఖాస్తులు టీఎస్‌పీఎస్‌సీకి అందాయి. శనివారం రాత్రి 12 గంటల వరకు గడువు ఉండడంతో దరఖాస్తులు 4 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే దరఖాస్తుల గడువు ఇటీవల పెంచడంతో దానికి అనుగుణంగా ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీని ముందుగా ప్రకటించినట్లుగా జులై లేదా ఆగస్టులో నిర్వహించకుండా వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి కమిషన్‌కు విజ్ఞప్తులు అందుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement