Tuesday, November 26, 2024

రికార్డు స్థాయిలో అప్పన్న హుండీ ఆదాయం.. 29 రోజుల్లో, రూ.1.89 కోట్లు నగదు

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో : సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా భారీ ఆదాయం లభించింది. ఆలయ ఇవో వి.త్రినాధరావు పర్యవేక్షణలో ఆలయ అధికారులు, సిబ్బంది హుండీలు తెరిచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. 29 రోజులకు సంబంధించి రూ.1.89 కోట్లు నగదు లభించగా బంగారం, వెండి కూడా పలువురు భక్తులు సమర్పించారు.

అంతేకాకుండా వివిధ దేశాలకు చెందిన డాలర్లు భక్తులు హుండీలో వేయడం జరిగింది. ఇటీవల కాలంలో సింహగిరికి భక్తులు తాకిడి ఘననీయంగా పెరిగింది. అప్పన్న చందనోత్సవం తరువాత హుండీలు తెరిచి లెక్కించడంతో పెద్ద మొత్తంలో ఆదాయం లభించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. లెక్కింపు కార్యక్రమంలో అధికారులతో పాటు పలువురు స్వచ్చంద సంస్థలు పాల్గొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement