Tuesday, November 12, 2024

ద.మ.రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే తొలిసారిగా ప్రయాణికులతో రూ.5000.81 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది 2019-20లో ఆర్జించిన ఆదాయం రూ.4,119.44 కోట్ల కంటే రూ.881.37 కోట్లు అదనం. కోవిడ్‌ లాక్‌డౌన్‌ తరువాత ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి జోన్‌ నిరంతరం ప్రయాణికుల రద్దీని సమీక్షిస్తోంది. ఈ సందర్భంగా ద.మ.రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5000 కోట్ల ప్రయాణికుల ఆదాయాన్ని నమోదు చేసినందుకు సిబ్బందిని అభినందించారు.

వివిధ శాఖల మధ్య సమన్వయంతో పాటు అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం వల్ల మంచి ఫలితం లభించిందని పేర్కొన్నారు. జోన్‌, అత్యుత్తమ పనితీరును సాధించడంలో, ఈ ప్రీమియర్‌ జోన్‌ను నడిపించడంలో ఇది ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. ప్రయాణికుల డిమాండ్‌ను తీర్చడానికి జోన్‌ ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యత ఇస్తుందనీ, వారి ప్రయాణ అవసరాలను తీర్చడానికి అవసరమైన అన్ని చర్యలను కొనసాగిస్తుందని ఈ సందర్భంగా జైన్‌ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement