Thursday, November 21, 2024

రికార్డ్ లు బ్రేక్ చేసిన రో‘హిట్’ మ్యాన్​.. టీ 20 ఫార్మాట్ లో నెంబర్​ 1

భారత కెప్టెన్ రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన రికార్డ్‌ని అందుకున్నాడు. లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 32 బంతుల్లో 44 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. గురువారం వరకూ ఈ రికార్డ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 3,299 పరుగులతో టాప్‌లో ఉండగా.. ఈ రికార్డ్‌ని 3,307 పరుగులతో రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు.

అత్యధిక పరుగుల రేసులో, రోహిత్, గప్టిల్, కోహ్లీ మధ్య రేసు కొనసాగుతుంది. ముగ్గురి మధ్య పెద్దగా తేడా లేదు. 108 ఇన్నింగ్స్‌లలో 3299 పరుగులు చేసిన రోహిత్ తర్వాత గప్టిల్ రెండవ స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 97 మ్యాచ్‌ల్లోనే 3,296 పరుగులు చేశాడు. కానీ.. సెంచరీ మార్క్‌ని మాత్రం ఒకసారి కూడా కోహ్లీ అందుకోలేకపోయాడు అతని ఖాతాలో 30 అర్ధశతకాలు ఉండగా.. అత్యధిక వ్యక్తిగత స్కోరు 94 పరుగులు.. చాలా కాలం పాటు ఈ రికార్డును కలిగి ఉన్న కోహ్లి 89 ఇన్నింగ్స్‌లలో 3296 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement