Tuesday, November 19, 2024

తొలి భారతీయుడిగా రికార్డు.. డింగ్‌ లిరెన్‌తో ఫైనల్‌ పోరు టై బ్రేక్‌లో ఉత్కంఠభరిత గెలుపు..

న్యూఢిల్లి : ఇండియన్‌ యంగ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ 16 ఏళ్ల రమేశ్‌ బాబు ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ బుడ్డోడి పేరే వినిపిస్తున్నది. మెల్ట్‌ వాటర్‌ ఛాంపియన్స్‌ చెస్‌ టూర్‌లో భారత్‌ తరఫున ఘనత సాధించాడు. చెస్సేబుల్‌ ఆన్‌లైన్‌ మాస్టర్స్‌ టోర్నీలో ఫైనల్స్‌లో అడుగుపెట్టాడు. బుధవారం జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో 3వ ర్యాంకర్‌, డచ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ అనిష్‌ గిరిని 3.5-2.5తో ఓడించి చెస్సేబుల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. నాలుగు గేమ్‌ల పాటు 2-2తో సమానంగా ఉన్నప్పటికీ.. కీలకమైన టై బ్రేక్‌లో ప్రజ్ఞానంద ఎత్తులకు పై ఎత్తులతో అనిష్‌ గిరిపై సంచలన విజయం సాధించాడు. కాగా తొలి గేమ్‌లో ఓడినప్పటికీ.. ప్రజ్ఞానంద పుంజుకుని రెండో ఆటలో విజయం సాధించాడు. మళ్లిd మూడో గేమ్‌లో అనిష్‌ గిరి మొదట ఆధిక్యంలో కనిపించినప్పటికీ.. ప్రజ్ఞానంద ఎత్తుకు పై ఎత్తులు వేసి 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. కీలకమైన నాల్గో గేమ్‌లో అనిష్‌ గిరి విజయం సాధించడంతో 2-2తో మ్యాచ్‌ టై బ్రేక్‌కు దారితీసింది. టై బ్రేక్‌లో 33వ ఎత్తులో అనిష్‌ చేసిన తప్పిదాన్ని ప్రజ్ఞానంద ఉపయోగించుకున్నాడు.

11వ తరగతి పరీక్షలకు హాజరై..

16 మంది గ్రాండ్‌ మాస్టర్లు పోటీపడిన ప్రిలిమినరీ లీగ్‌ ముగిసే సరికి అనిష్‌ గిరి అగ్ర స్థానంలో నిలిచాడు. మరో సెమీస్‌లో గత సీజన్‌ రన్నరప్‌, ప్రపంచ ఛాంపియన్‌, టాప్‌సీడ్‌ మాగస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. రెండో సెమీస్‌లో కార్‌ ్లసన్‌ 1.5-2.5 పాయింట్ల తేడాతో ప్రపంచ నెంబర్‌ 2 డింగ్‌ లిరెన్‌ (చైనా) చేతిలో అనూహ్య ఓటమిపాలయ్యాడు. నాల్గో రౌండ్‌ చివరి 15 నిమిషాల ర్యాపిడ్‌ గేమ్‌లో కార్ల్‌సన్‌ అనవసర తప్పిదాలు చేసి ఓటమిపాలయ్యాడు. ప్రజ్ఞానంద బుధవారం 11వ తరగతి పరీక్షలు హాజరై ఈ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. నేడు ప్రజ్ఞానందను ప్రధాని మోడీ కలిసే అవకాశం ఉంది. ఫైనల్స్‌లో 16 ఏళ్ల ప్రజ్ఞానంద.. 2వ ర్యాంకర్‌ డింగ్‌ లిరెన్‌తో తలపడనున్నాడు. మ్యాచ్‌ అర్ధరాత్రి దాటిన తరువాత కూడా సాగడంతో.. మ్యాచ్‌ పూర్తయిన తరువాత ప్రజ్ఞా మాట్లాడుతూ.. నాకు ఉదయం 8.45 గంటలకు స్కూల్‌ ఉంది. ఇప్పుడు సమయం ఉదయం 2 దాటింది. స్కూల్‌ వెళ్లగలనా..? అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజ్ఞానంద ప్రదర్శనపై కోచ్‌ ఆర్‌బీ రమేశ్‌ సంతోషం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement