Monday, November 18, 2024

యాదాద్రి త‌ర‌హాలో బాస‌ర ఆల‌య పునఃనిర్మాణం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

యాదాద్రి త‌ర‌హాలో బాస‌న ఆల‌యాన్ని పునఃనిర్మించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని, సీఎం కేసీఆర్ పాల‌న‌లో ఆల‌యాల‌కు మ‌హ‌ర్ధ‌శ వ‌చ్చింద‌ని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆలయాలకు పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద‌న్నారు. దక్షిణభారతంలో ఎంతో ప్రసిద్ధి చేసిన బాసర జ్ఞానసరస్వతీ అమ్మవారి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ క్రమంలో శృంగేరి పీఠాధిపతుల మార్గదర్శనం, ఆగమ నిర్దేశం మేరకు బాస‌ర ప్రధాన ఆల‌య‌ పునర్నిర్మాణ ప్రక్రియ జరపాలని సీఎం కేసీఆర్‌ దిశానిర్ధేశం మేర‌కు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశానుసారం బాస‌ర ఆల‌య బృందం శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ స్వామిని కలిసింది. ప్రధాన ఆల‌య అభివృద్ధి, విస్తరణ ప్లాన్‌తోపాటు ఆగమ, ఆలయ సంబంధమైన ప్రతిపాదనలు భారతీస్వామి ముందుంచారు. శృంగేరి పీఠం నుంచి తిరిగివ‌చ్చిన ఆల‌య బృందంతో గురువారం ఇవాళ శాస్త్రిన‌గ‌ర్‌లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రెడ్డి స‌మీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా శృంగేరి పీఠాధిప‌తి చేసిన మార్పులు, సూచ‌న‌లను మంత్రికి వివ‌రించారు. శృంగేరి పీఠాధిప‌తి సూచ‌న‌లు పాటించాల‌ని, దానికి అనుగుణంగా ఆల‌య పున‌ర్నిర్మాణం ప్లాన్‌ను సిద్ధం చేయాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement