న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కడప జిల్లా చింతలకుంటలోని రాతి చిత్రాలను జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారకాలుగా ప్రకటించేందుకు గుర్తించినట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. రాతిపై చెక్కిన మధ్య శిలాయుగం నాటి పెయింటింగులకు సంబంధించిన వివరాలు తెలియజేయాల్సిందిగా వైఎస్సార్సీపీ లోక్‌సభయ సభ్యులు బాలశౌరి అడిగిన ప్రశ్నలకు సోమవారం ఆయన సమాధానమిచ్చారు. రాతి చిత్రాల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. స్థానికుల నుంచి అభ్యంతరాలు, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ కార్యాలయం ద్వారా నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement