ప్రముఖ కంపెనీ రియల్మీ.. టెక్నాలజీ బ్రాండ్ అయిన రియల్మీ టెక్లైఫ్ సెమీ ఆటోమెటిక్ వాషింగ్ మిషన్‌ను తీసుకొచ్చింది. పెరుగుతున్న గృహోకరణాల్లో వీటి వినియోగం కూడా ఉందని రియల్మీ టెక్లైఫ్ తెలిపింది. ఈ డిమాండ్‌ను తీర్చేందుకు ఎంతో సమర్థవంతమైన, శక్తివంతమైన సెమీ ఆటోమెటిక్ వాషింగ్ మెషిన్ దోహదపడుతుందని ప్రకటించింది. సెమీ ఆటోమెటిక్ వాషింగ్ మెషిన్లకు ఎంతో పోటీ ఉందని, ఈ ఉత్పత్తి.. రియల్మీ విస్తరణకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించింది. హార్డ్ వాటర్ వాష్ ఫీచర్‌తో దీన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది. కొత్త రేంజ్ ఫ్లిప్‌కార్ట్‌లో 8 కిలోలు, 8.50 కిలోల రేంజ్లో అందుబాటులో ఉన్నట్టు ప్రకటించింది. అన్ని పన్నులతో కలిపి.. దీని ధరను రూ.10,990గా నుంచి ఉంటుందని పేర్కొంది.
జెట్ స్ట్రీమ్ టెక్నాలజీ..
సెమీ ఆటోమేటిక్, టాప్ లోడ్ లైనప్‌లో బట్టలను ఎంతో బాగా శుభ్రపర్చడం జరుగుతాయని, జెట్ స్ట్రీమ్ టెక్నాలజీ కూడా ఉందని తెలిపింది. అధిక శక్తి సామర్థ్యం, అధిక పనితీరు ఆధారంగా ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చిందని రియల్మీ టెక్లైఫ్ ప్రకటించింది. ఈ సందర్భంగా రియల్ మీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మాధవ్ శేథ్ మాట్లాడుతూ.. ట్రెండ్ సెట్టింగ్‌లో రియల్మీ టెక్లైఫ్ ముందంజలో ఉందన్నారు. సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడం ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. వాషింగ్ మెషిన్ దీర్ఘ కాలం ఉండే మోటార్‌తో హార్డ్ వాటర్, బ్యాక్టిరియా రహిత వాష్‌ను అందిస్తుందని చెప్పుకొచ్చారు. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయని, ఈ సంస్థతో ఒప్పందం చేసుకోవడం కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు ముందు వరుసలో ఉంటామని ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..