దేశంలో రాయలసీమ పేరు చెబితే భయపడే పరిస్థితులు తీసుకువచ్చారని తెలుగు సినీ పరిశ్రమపై మండిపడ్డారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. రాయలసీమ జోలికి రావొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సినిమా వాళ్ల వల్లే రాయలసీమకు ఈ చెడ్డపేరు వచ్చిందని మండిపడ్డారు. సీమ ప్రజలను హంతకులుగా, విలన్లుగా చూపిస్తున్నారన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. రాయలసీమ ప్రజలకు దాహమేస్తే రక్తం తాగుతారని చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్లు రాయలసీమనే ఎందుకు టార్గెట్ చేసుకున్నారని ప్రశ్నించారు. తమపైనే ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నారన్నారు. కొండారెడ్డి బురుజు దగ్గర ఆ నరుకుడు సీన్లు ఏంటన్న బైరెడ్డి.. మీ లాభం కోసం సీమ ప్రజలందర్నీ చెడ్డవాళ్లుగా మార్చేస్తారా అని తీవ్ర స్థాయిలో ఆక్షేపించారు. సీమకు అసలైన విలన్లు సీనిమా వాళ్లేనని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. సినిమా వాళ్లే. సీమ ప్రజలను హంతకులుగా, విలన్లుగా చూపిస్తున్నారు. సినిమా వాళ్లకు మేమే దొరికామా. మాపైనే ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. రాయలసీమలో అసలు విలన్లు సినిమావాళ్లు. రాజకీయ నేతలే అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement