హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఏళ్ల క్రితం దళితులకు, గిరిజనులకు అసైన్ చేసిన భూములకు రక్షణ కల్పించకపోగా వారి జీవనాధారాన్ని దెబ్బతీస్తూ ఆ భూముల్లో రియల్ ఎస్టే వ్యాపారాలను ప్రోత్సహించడం దుర్మార్గమని రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనులను మభ్యపెట్టి, భయపెట్టి వారి భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పూనుకోవడం గర్హనీయమన్నారు. దళిత, గిరిజనులకు మూడు ఎకరాల సాగు భూమి ఇస్తామన్న హామీని అమలు చేయకపోవడంతో లక్షలాది మంది దళిత, గిరిజనుల ఆశలు అడియాశలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దళిత, గిరిజన అసైన్డ్ భూములకు వెంటరనే రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్‌కు శుక్రవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. అసైన్డ్ భూముల్లో ఏన్నో ఏళ్లుగా పోడు దళిత, గిరిజనులు పోడు చేసుకుంటుండగా ఆ భూముల్లో రియల్ వ్యాపారాన్ని ప్రోత్సహించడమంటే వారి నోటికాడి ముద్దను లాక్కున్నట్లేనని స్పష్టం చేశారు. పోడు భూములకు పట్టాలిస్గామన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిద్ధిపేటలో మీరు ప్రారంభ:ఇంచిన వెంచర్ దళితుల భూముల్లోనే , శంషాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ప్రయత్నిస్తోంది గిరిజన భూముల్లోనేనని తేల్చి చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా దళిత, గిరిజనుల నుంచి అసైన్డ్ భూములు లాక్కుంటున్న ఉదంతాలు కో కొల్లలు అని పేర్కొన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా..? అని ప్రశ్నించారు. మీరు మీ కుటుంబం మాత్రం బాగుంటే సరిపోతుందా..? అని ప్రశ్నించారు. దళితులు, గిరిజనుల పైన రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని ఆరోపించారు. దళిత, గిరిజన సంక్షేమం అంటే ఎత్తౖన వి గ్రహాలు, పాలనా భవంతులకు పేర్లు పెట్టడం కాదని, వారికి జీవనోపాధి కల్పించడమేనని తేల్చి చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో అంతో ఇంతో జీవనోపాధిని కూడా దళిత, గిరిజనులు కోల్పోయి రోడ్డున పడ్డారని , అన్ని విధాలుగా నష్టపోయారని లేఖలో ఘాటుగా పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో దళిత, గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఫీజు రియంబర్స్ మెంట్‌లో నిర్లక్ష్యం కారణంగా ఎస్సీఎస్టీబీసీ విద్యార్థులు ఇప్పటికే చదువుకు దూరం అవుతున్నారని గుర్తు చేశారు. దళిత, గిరిజన అసైన్డ్ భూములను కాపాడకుంటే వారి పక్షాన బీజేపీ తెలంగాణశాఖ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని లేఖలో సీఎం కేసీఆర్‌ను హెచ్చరించారు.