Saturday, November 23, 2024

వేగంగా పోలవరం జలవిద్యుత్‌ పనులు, 12 ట‌న్నెల్స్‌ లో ఫెరోల్స్‌ అమరిక

అమరావతి, ఆంధ్రప్రభ : పోలవరం ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మిస్తున్నజలవిద్యుత్‌ కేంద్రం టన్నెల్‌ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 12 ప్రెజర్‌ టన్నెల్స్‌ పనులు పూర్తి కాగా వాటిన్నిటిలో ఫెరోల్స్‌ అమరిక పనులను ప్రారంభించారు. ఒక్కో టన్నెల్‌ లో 52 ఫెరోల్స్‌ చొప్పున 12 టన్నెల్స్‌ లో 624 ఫెరోల్స్‌ ను ఇంజనీరింగ్‌ నిపుణులు విజయవంతంగా అమర్చారు. 9 మీ డయాఫ్రంతో 25 మి.మీ మందంతో ఎమ్మెస్‌ ప్లేట్స్‌ వినియోగించి ఫెరోల్స్‌ ను తయారుచేసినట్టు- నిపుణులు వెల్లడించారు. పోలవరం జలవిద్యుత్‌ కేంద్రంలో ఫెరోల్స్‌ తయారీ కోసం ఇప్పటివరకు 8520 టన్నుల స్టీల్‌ వినియోగించినట్టు తెలిపారు.

జలవిద్యుత్‌ కేంద్రం సొరంగాల్లో (టన్నెల్స్‌) నీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా క్రమ పద్ధతిలో సక్రమంగా ప్రవహించేందుకు ఫెరోల్స్‌ ఉపయోగపడతాయి. ఫెరోల్స్‌ అమరిక పనులను ఏపీ జెన్‌ కో సూపరింటెండెండ్‌ ఇంజనీర్‌ శేషారెడ్డి ప్రారంభించగా మేఘా ఇంజనీరింగ్‌ సంస్ద సిజిఎం ముద్దుకృష్ణ, డిజిఎం క్రాంతికుమార్‌, రాజేష్‌ కుమార్‌,సీనియర్‌ మేనేజర్‌ మురళి,తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement