భారత్‌తో తలపడేందుకు దక్షిణాఫ్రికా సన్నద్దమవుతోంది. తన ప్రత్యర్థితో టీ 20 సిరీస్‌లో తలపడనుంది. భారత జట్టును ఎదుర్కోవడానికి నెట్ బౌలర్‌గా రౌనక్ వాఘేలాను ఎన్నుకున్నారు. ది. వాఘేలా…దేశరాజధానికి చెందిన ఓ క్రీడాకారుడు. వెంకటేశ్వర్ అకాడమీలో వాఘేలా శిక్షణ పొందుతున్నాడు. పైగా అండర్ 16 జట్టులో సభ్యుడు కూడా. దక్షిణాఫ్రికా జట్టులో సభ్యులు తక్కువగా ఉండడంతో ఇతనికి ఈ అవకాశం దక్కింది, దేశరాజధాని వేదికగా ఈ నెల 8న ఇరు జట్లు తలపడనున్నాయి.
ఇందుకోసం ఈ రెండు జట్లు తీవ్ర సాధన చేస్తున్నాయి. ఇక భారత జట్టుకు సారధిగా రాహుల్ వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్, జట్టు సభ్యులుగా శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ హార్దిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్. రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్ ఉమ్రాన్ మాలిక్, అక్షర పటేల్ ఉంటారు. మరోవైపు దక్షిణాఫ్రి కా టీం కెప్టెన్‌గా తెెంబ బవూమా, క్వింటన్ డీ కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ తదితరులు తలపడనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.