RCB vs LSG | కీల‌క‌పోరులో చేతులెత్తేసిన ఆర్సీబీ టాపార్డ‌ర్…

ఐపీఎల్‌2024లో భాగంగా నేడు లక్నోతో జరుగుతన్న కీలక పోరులో ఆర్సీబీ టాపార్డర్ బ్యాటర్లు చేతులెత్తాశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో… ఆర్సీబీ ముందు 182 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. అయితే చేజింగ్‌లో ఆర్సీబీ టాపార్డర్ కుప్పకూలింది. 8 ఓవర్లోనే 54 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయింది.

ఐదో ఓవర్ రెండో బంతికి సిద్ధార్థ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ(22) ఔటయ్యాడు. ఇక ఆరో ఓవర్ పడిక్కల్ బౌలింగ్‌లో కెప్టెన్ ఫాప్ డూప్లిసిస్ (19).. గ్లెన్ మాక్స్ వెల్ (0) ఔటయ్యారు. ఇక 8వ ఓవర్లో మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో కామెరాన్ గ్రీన్ (9) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో రజత్ పాటిదార్, అనుజ్ రావత్ ఉన్నారు.

Exit mobile version