ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. హోం గ్రౌండ్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నైపై 27 పరుగుల తేడాతో గెలుపొంది ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది.
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ చెన్నై ముందు 219 పరుగుల భారీ టార్గెట్ సెట్ చేసింది. ఇక ఢిఫెండింగ్లోనూ రాణించిన బెంగళూరు జట్టు.. చెన్నైను 191 పరుగులకే కట్టడి చేసింది. దీంతో చెన్నై పై ఆధిక్యత సాధించి.. అభిమానుల మనసు దోచుకుంది.
ఆర్సీబీ నిర్దేశించిన భారీ ఛేదనలో చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ డకౌట్ కాగా, డారిల్ మిచెల్ 4 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో 19 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో రచిన్ రవీంద్ర (61) అర్థ శతకంతో చెలరేగాడు. అతకి తోడుగా డేంజరస్ అజింక్యా రహానే(33) ఆకట్టుకున్నాడు. ఇక ఎంఎస్ ధోని(25) మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా (42 నాటౌట్) ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.