ఐపీఎల్ 2024లో భాగంగా నేడు (సోమవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు హైదరాబాద్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా, బెంగళూరు హోం గ్రౌండ్ చిన్న స్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరి కొద్ది సేపట్లో ప్రారంభంకానుంది.
తుది జట్లు :
సన్‌రైజర్స్ హైదరాబాద్ :
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (c), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టీ నటరాజన్, నితీష్ కుమార్ రెడ్డి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :
ఫాఫ్ డు ప్లెసిస్ (c), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, సౌరవ్ దిలీప్‌సింగ్ చౌహాన్, విల్ జాక్స్, దినేష్ కార్తీక్ (wk), మహిపాల్ లోమ్రోర్, రీస్ టోప్లీ, వైషాక్ విజయ్‌కుమార్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్.
బెంగళూరుకు గెలుపు బెంగ..
అయితే, ఈ సీజన్‌లో బెంగళూరు ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. దీంతో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇవ్వాల సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్ అత్యంక కీలకంగా మారనంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు… ఐదు మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
సొంత గడ్డపై జరుగుతున్న పోరులో ఎలాగైనా విజయం సాధించి మళ్లీ గాడిలో పడాలనే లక్షంతో బెంగళూరు ఉంది. అయితే కీలక ఆటగాళ్లు విఫలమవుతుండడం బెంగళూరుకు ప్రతికూలంగా మారింది. విరాట్ కోహ్లి, దినేశ్ కార్తీక్‌లు మాత్రమే నిలకడైన ఆటను కనబరుస్తున్నారు. కెప్టెన్ డుప్లెసిస్ కూడా తన స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమవుతున్నాడు. స్టార్ బ్యాటర్ మ్యాక్స్‌వెల్ అత్యంత చెత్త ఆటతో నిరాశ పరుస్తున్నాడు.
బౌలింగ్ విభాగంలోనూ సిరాజ్, ఆకాశ్‌దీప్, మ్యాక్స్‌వెల్, టోప్లే, విజయ్‌కుమార్ వైశాఖ్, విల్ జాక్స్ తదితరులు పూర్తిగా విఫలమవుతున్నారు. రెండు విభాగాల్లోనూ బలహీనంగా మారడంతో బెంగళూరుకు వరుస ఓటములు తప్పడం లేదు. దీంతో బెంగళూరు జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌తో పోరు జట్టుకు సవాల్‌గా మారింది.
విజయమే లక్ష్యంగా సన్‌రైజర్స్ ..
ఇక హైదరాబాద్ ఆడిన ఐదు మ్యాచుల్లో మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కిందటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించడం సన్‌రైజర్స్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యంది. బెంగళూరుపై కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది.
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్‌క్రమ్, నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, సమద్, షాబాజ్ అహ్మద్ తదితరులతో హైదరాబాద్ బ్యాటింగ్ బలంగా ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌లోనూ హైదరాబాద్ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.