Sunday, June 30, 2024

RCB vs LSG | లక్నో చేతిలో చిత్తుగా ఓడిన ఆర్సీబీ…

సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా పరాజయాల పాలవుతొంది. ఇవ్వాల లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 182 పరుగుల ఛేదనలో.. ఆర్‌సీబీ బ్యాటింగ్‌ లైనప్‌ కుప్పకూలింది. 19.4 ఓవ‌ర్ల‌లో 153 ప‌రుగుల‌కు ఆలౌంట్ అయ్యింది. ఫలితంగా ఆర్సీబీపై లక్నో 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.

8 ఓవర్లలోపే ఆర్సీబీ కీలక వికెట్లు కోల్పోయింది.. విరాట్ కోహ్లీ (22), డూప్లెసిస్(19), రజత్ పాటిదార్ (29) పరుగులకే పెవిలియ‌న్ చేరారు. ఇక మహిపాల్ లోమ్రోర్ (33) పోరాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్ మూడు వికెట్లు, నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు తీయగా., మణిమారన్ సిద్ధార్థ్, యశ్ రవిసింగ్ ఠాకూర్, మార్కస్ స్టోయినిస్ చరో వికెట్ దక్కించుకున్నారు. ఇక ఈ విజయంతో నాలుగు పాయింట్లు సాధించిన లక్నో జట్టు పాయింట్ల పట్టికలో 6వ స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది.

ఇక అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (81) పరుగులతో విజృంభించి ఐపీఎల్‌లో 22వ అర్ధశతకం బాదాడు. ఇక చివర్లో వచ్చిన పూరన్ 40 (నాటౌట్) పరుగుల వరద పారించాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (20), మార్కస్ స్టోయినిస్ (24) పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement