Tuesday, November 26, 2024

RCB vs KKR | టాస్ గెలిచిన కోల్‌కతా.. ఫస్ట్ బ్యాటింగ్ ఆర్సీబీదే !

ఐపీఎల్ 2024 లో భాగంగా ఇవాళ రాయ‌ల్ చాలెంజర్స్ బెంగళూరు – కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇక ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ చిన్న స్వామి స్టేడియం వేదికగా జరగుతున్న ఈ మ్యాచ్ బెంగళూరు జట్టు బ్యాటింగ్ తో బరిలోకి దిగనుండగా.. మరి కొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

గత మ్యాచ్‌లో పంజాబ్‌పై అద్భుత విజయం సాధించిన బెంగళూరు.. ఈసారి కూడా అదే జోరు ప్రదర్శించాలనే పట్టుదలతో బరిలోకి పట్టుదలతో బరిలోకి దిగనుంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిన కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. బెంగళూరును ఓడించి రెండో విజయాన్ని అందుకోవాలనే లక్షంతో ఉంది.

జ‌ట్ల వివ‌రాలు :

కోల్‌కతా నైట్ రైడర్స్ :

ఫిలిప్ సాల్ట్ (WK), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (c), రింకు సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

- Advertisement -

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :

ఫాఫ్ డు ప్లెసిస్ (c), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (WK), అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అద్భుత బ్యాటింగ్‌తో బెంగళూరును ఆదుకున్నాడు. అద్భుత బ్యాటింగ్‌తో ఫినిషర్‌‌గా మారిన దినేశ్ కార్తీక్ ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. అయితే కీలక బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించక పోవడం జట్టును కలవరానికి గురి చేస్తోంది. కెప్టెన్ డుప్లెసిస్, కామెరూన్ గ్రీన్, మ్యాక్స్‌వెల్‌ల వైఫల్యం జట్టును వెంటాడుతోంది. మరోవైపు సిరాజ్, యశ్ దయాల్, అల్జరీ జోసెఫ్, గ్రీన్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

ఆత్మవిశ్వాసంతో కోల్‌కత్తా..

మరోవైపు కోల్‌కతా కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కోల్‌కతా బలంగా ఉంది. ఆరంభ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు నరైన్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, కెప్టెన్ శ్రేయస్‌అయ్యర్ తదితరులు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచాల్సి ఉంటుంది. ఇక ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. సునీల్ నరైన్, మిఛెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో కోల్‌కతా కూడా విజయమే లక్షంగా బరిలోకి దిగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement