చిన్న స్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ తక్కువ పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ.. ఛేజింగ్‌లో చెలరేగింది. దీంతో హోం గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌ను 13.4 ఓవర్లలోనే ముగించి గుజరాత్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
గుజరాత్‌ను 147 పరుగులకే ఆలౌట్ చేసిన బెంగళూరు ఛేజింగ్‌లో వీరవిహారం చేసింది. స్వల్ప ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్లు దంచి కొట్టారు. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ (64) 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. మరోవైపు కోహ్లీ (42)తో బౌండరీల వర్షం కురిపించాడు. ఇక దినేష్ కార్తీక్ (21 నాటౌట్) స్వప్నిల్ సింగ్ (15 నాటౌట్) రాణించారు. పాయింట్స్ టేబుల్‌లో చివరన ఉన్న బెంగళూరు.. ఇవ్వాల్టి విజయంతో ఏడవ స్థానికి చేరింది.. దీంతో ఈ సీజన్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగానే ఉంచుకుంది