ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు తమ చివరి లీగ్ ఆడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన… . మరికొద్ది సేపట్లో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా, ఈ సీజన్ ప్లేఆఫ్స్‌లో ఇప్పటికే మూడు జట్లు తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. ఇక ఆఖరి బెర్త్ కోసం నేడు సీఎస్‌కే, ఆర్‌సీబీ జట్లు పోటీపడుతుండగా.. ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది.
జట్ల వివరాలు :
చెన్నై సూపర్ కింగ్స్ :
రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (c), డారిల్ మిచెల్, అజింక్యా రహానే, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (wk), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, సిమర్‌జీత్ సింగ్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (c), గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (WK), మహిపాల్ లోమ్రోర్, యశ్ దయాల్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్‌కు చేరుకోవడానికి ఒక పాయింట్ అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే విపత్తు తప్పదు. అదే సమయంలో ఆర్‌సీబీ ప్లేఆఫ్‌లోకి వెళ్లాలంటే చెన్నైని ఎలాగైనా ఓడించాలి. ఆర్సీబి ముందుగా బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేస్తే ప్లేఆఫ్‌కు చేరుకోవడానికి సిఎస్కే ని 18 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్ష్యాన్ని ఛేదించి ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే చెన్నైపై ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే గెలవాల్సి ఉంటుంది.