Friday, November 22, 2024

RCB vs LSG | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..

ఐపీఎల్ 2024 లో భాగంగా ఇవ్వాల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – లక్నో సూపర్ జెయింట్స్ జ‌ట్టు త‌ల‌ప‌డ‌నున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇక ఆర్సీబీ హోం గ్రౌండ్ బెంగళూరు చిన్న స్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.

జట్ల వివరాలు :

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :

ఫాఫ్ డు ప్లెసిస్ (c), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్), రీస్ టోప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.

లక్నో సూపర్ జెయింట్స్ :

కేఎల్ రాహుల్ (c), క్వింటన్ డి కాక్ (WK), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్.

- Advertisement -

ఈ రెండు జట్లూ సమవుజ్జీగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్, ఫాస్ట్, స్పిన్ బౌలింగ్‌లు సమతూకంగా ఉన్నాయి. కానీ ఆర్సీబీ టాపార్డర్‌‌లో విరాట్ కోహ్లీ ఒక్కడే ఆడుతూ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతడికి మిగతావారు సహకరిస్తే నేటి మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఇక బెంగళూరు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. అయితే నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.

మరోవైపు రెండు మ్యాచ్‌లు ఆడిన లక్నో 2 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో ఓడిన లక్నో.. తర్వాతి మ్యాచ్ లో పంజాబ్ తో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరుపై కూడా అదే జోరు కొనసాగించాలనే ఆత్మవిశ్వాసంతో సయితం బరిలోకి దిగుతోంది. బెంగళూరును ఓడించి రెండో విజయాన్ని అందుకోవాలనే లక్షంతో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement