Tuesday, November 26, 2024

మరోసారి వడ్డీ రేట్లు పెంచనున్న ఆర్బీఐ..

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రిందుకు మరోసారి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచనుందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా కేంద్ర బ్యాంక్‌ 75 బేసిస్‌ పాయింట్లు పెంచినందున ఆదే దారిలో ఆర్బీఐ కూడా వరసగా మూడోసారి 25 నుంచి 35 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని వీరు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్బీఐ ఇప్పటికే రెండుసార్లు కీలక వడ్డీ రేట్లను పెంచింది. ఆర్బీఐకి చెందిన ద్రవ్య విధాన కమిటీ ఆగస్టు 3న సమావేశం కానుంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపు ప్రకటించనుందని భావిస్తున్నారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇంకా 6 శాతానికి కంటే ఎక్కువగానే నమోదవుతోంది. ఆర్బీఐ ఇప్పటికే మే నెలలో 40 బేసిస్‌ పాయింట్లు, జూన్‌లో 50 బేసిస్‌ పాయింట్లు రెపోరేటును పెంచిన విషయం విధితమే.

ప్రస్తుతం ఉన్న రెపోరేటు 4.9 శాతం , కోవిడ్‌ కాలానికి ముందు ఉన్న 5.15 శాతం కంటే తక్కవగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్‌ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆర్బీఐ వడ్డీరేట్లు గణనీయంగా తగ్గించింది. కోవిడ్‌ కంటే ముందున్న స్థాయికి ప్రస్తుతం రెపోరేటును పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తరువాత కాలంలో ఇది మరింత పెరగే సూచనలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వినియోగదారుల ధరల సూచీ 4 శాతానికి మించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం గతంలో ఆర్బీఐని కోరింది. దీన్ని సాధించేందుకు ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభం అంచులో ఉన్నందున అక్కడి కేంద్ర బ్యాంక్‌ ఒకేసారి 75 బేసిస్‌ పాయింట్లు పెంచిందని, ఆ పరిస్థితు మన దేశంలో లేనందున ఈ పెంపుదల 25 నుంచి 35 పాయింట్లు మించకపోవచ్చని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఆగస్లు 3 సమావేశం తరువాత వచ్చే రెండు సమావేశాల్లోనూ రెపోరేటు పెంచకతప్పదని వారు స్పష్టం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement