Tuesday, November 19, 2024

ఏపీ ప్రభుత్వానికి అర్బీఐ రూ. 3500 కోట్ల రుణం

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద సెక్యూరిటీ- బాండ్ల వేలంలో పాల్గొంది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ.3500 కోట్ల రుణం తీసుకుంది. ఇందులో వెయ్యి కోట్ల రూపాయలు 6 సంవత్సరాలకు 7.34 శాతం, మరో వెయ్యి కోట్లు 20 సంవత్సరాలకు 7.37 శాతం వడ్డీతో అప్పు తీసుకుంది. అలాగే 500 కోట్లు 8 సంవత్సరాలకు 7.40 శాతం, మరో 500 కోట్లు 10 సంవత్సరాలకు 7.39 శాతం, ఇంకో 500 కోట్లు 15 సంవత్సరాలకు 7.38 శాతం వడ్డీతో ప్రభుత్వం అప్పు పొందింది.

మంగళవారం సాయంత్రానికి ఖజానాలో మొత్తం డబ్బు జమకానుంది. అయితే ఇందులో రిజర్వ్‌ బ్యాంక్‌ ఓడీని 1500 కోట్లు మినహాయించే అవకాశం ఉంది. మిగతా డబ్బుతో ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్‌లు వస్తాయని ఆశిస్తున్నారు. కాగా తాజాగా తీసుకున్న అప్పుతో గడిచిన 40 రోజుల్లో రూ. 9500 కోట్ల మేర ప్రభుత్వం అప్పు చేసినట్లయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement