Friday, November 22, 2024

88 శాతం వెనక్కి వచ్చిన 2 వేల నోట్లు

చలామణి నుంచి ఉపసంహరించుకున్న 2000 రూపాయల నోట్లు ఇప్పటి వరకు 88 శాతం బ్యాంక్‌లకు తిరిగి వచ్చినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. ఇప్పటి వరకు 3.14 లక్షల కోట్లు ఈ నోట్లు బ్యాంక్‌ల వద్దకు వచ్చాయని తెలిపింది. ఈ సంవత్సరం మార్చి 31నాటికి 3.62 లక్షల కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

క్లీన్‌ నోట్‌ పాలసీలో భాగంగా ఆర్బీఐ 2000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 87 శాతం నోట్లు బ్యాంక్‌ల్లో డిపాజిట్ల రూపంలో వచ్చాయి. మిగిలినవి నేరుగా బ్యాంక్‌ కౌంటర్ల నుంచి మార్చుకున్నవి ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. 2000 నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఇచ్చింది. ఈ లోగానే ప్రజలు నోట్లను మార్చుకోవాలని ఆర్బీఐ కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement