న్యూఢిల్లీ – ఈసారి కూడా కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచుతున్నట్లు స్పష్టం చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వరుసగా 11వ సారి కూడా రెపో రేటు ను 6.5 శాతంగానే ఫిక్స్ చేసింది. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇవాళ వెల్లడించారు.
రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ద్రవ్యోల్పణం, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి కూడా వడ్డీరేట్లలో మార్పులు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. కాగా, 2023 ఫిబ్రవరి నుంచి రెపో రేటును ఇలాగే కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 11వ సారి.
- Advertisement -