Tuesday, November 26, 2024

హెచ్‌డీఎఫ్‌సీపై ఆంక్షలు ఎత్తేసిన ఆర్బీఐ..

ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంకు ల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు రిజర్వ్‌బ్యాంక్‌ ఊరటనిచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీపై గతంలో విధించిన ఆంక్షలను ఆర్బీఐ ఎత్తేసింది. ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేసిందని హెచ్‌డీఎఫ్‌సీ ఎక్స్ఛేంజ్‌లకు సమాచారం అందించింది. కాగా గతంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు సంబంధించి ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, నగదు లావాదేవీలు తదితర కార్యకలాపాల్లో తరుచుగా అవాంతరాలు కలిగేవి.

ఈ విషయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ తీవ్రంగా పరిగణించింది. 2020 డిసెంబర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ డిజిటల్‌ 2.0 కింద తలపెట్టిన లావాదేవీలపై ఆంక్షలు విధించింది. కొత్తగా క్రెడిట్‌ కార్డులను ఎవరికీ జారీ చేయకుండా నిషేధం విధించింది. గతేడాది ఆగస్టులో ఆంక్షలను సడలించి క్రెడిట్‌ కార్డుల జారీకి అనుమతిచ్చింది. తాజాగా మార్చి 11న ఆర్బీఐ పూర్తిగా ఆంక్షలు ఎత్తివేసిందని హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement