ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్‌బీఐ శుభవార్త అందించింది. ఇకపై ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనంతో పాటు పెన్షన్ డబ్బులు సెలవు దినాల్లోనూ ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(NACH) నిబంధనల్లో మార్పులు తీసుకువచ్చింది. దీంతో సెలవుల్లోనూ వేతనం డబ్బులు, జమ అయ్యే అవకాశం ఏర్పడింది. ఈ నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమలుకోకి వస్తాయని ఆర్‌బీఐ తెలిపింది. అప్పటి నుంచి వేతనాలు, పెన్షన్, వడ్డీ జమ, ఈఎంఐలు, టెలిఫోన్, గ్యాస్ బిల్లులు 1వ తేదీనే జమ కావడం లేదా కట్ కావడం జరగనుంది.
ఆర్‌బీఐ గవర్నర్ ఇటీవల మాట్లాడుతూ.. ఆర్టీజీఎస్, NACH సేవలు ఇకపై రోజులో 24/7 అందుబాటులో ఉంటాయన్నారు. దీంతో ఆర్‌బీఐ నూతనంగా చేపట్టిన మార్పుల ద్వారా NACH సేవలు వారానికి ఏడు రోజుల పాటు అంబుబాటులోకి వస్తాయి. ఇప్పటి వరకు కేవలం బ్యాంకులు తెరిచినప్పుడు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉండేవి. దీంతో సెలవు దినాల్లో వేతనాలు, పింఛన్లు జమ కాకపోయేవి. దీంతో ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా నెలాఖరులో రెండో శనివారం, ఆదివారం, ఇతర సెలువులు వస్తే నాలుగైదు రోజుల పాటు వేతనాలు ఆగిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో అనేక మంది ఆర్థిక ఇబ్బందులు పడేవారు. కానీ ఇక నుంచి ఆ సమస్యలు తీరనున్నాయి.
ఈ వార్త కూడా చదవండి: జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి