Tuesday, November 26, 2024

RBI: వ్యవస్థ గాడిన పడే వరకు అవే వడ్డీ రేట్లు..

బ్యాంకు వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ గాడిన పడే వరకు ప్రస్తుతం ఉన్న రిపో రేటు, రివర్స్‌ రిపో రేటులను కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. మానిటరీ పాలసీ కమిటీ సూచించిందని, అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితినే కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటించారు. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్నట్టుగానే రిపో రేటు 4 శాతం, రివర్స్‌ రిపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి.

ద్రవ్యోల్బణం 5.7 శాతం పరిధిలో ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఆర్బీఐ రివర్స్‌ రెపో రేటును 3.35 శాతం వద్ద ఉంచుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.. జూన్‌లో ద్రవ్య విధాన కమిటీ అంచనాల ప్రకారం ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా అభివృద్ధి చెందాయి.. ఇక, కరోనా సెకండ్‌ వేవ్‌ ఎదురుదెబ్బ నుండి కూడా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని తెలిపారు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో దేశ రియల్ జిడిపిలో 9.5 శాతం వృద్ధి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జి‌డి‌పి 17.2 శాతంగా ఉంటుందని శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యోల్బణంపై  శక్తికాంత దాస్ 2021-2022 ఆర్థిక సంవత్సరంలో సిపిఐ 5.7 శాతంగా ఉండవచ్చని, గత సమావేశంలో దీనిని 5.1 శాతంగా అంచనా వేశారు. రెండవ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 5.9 శాతం, మూడో త్రైమాసికంలో 5.3, నాల్గవ త్రైమాసికంలో 5.8 శాతం ఉండవచ్చు తెలిపారు. అలాగే 2022-2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సిపిఐ 5.1 శాతంగా ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది

Advertisement

తాజా వార్తలు

Advertisement