Friday, November 22, 2024

దేశంలో మరో కొత్త బ్యాంక్.. ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మరో కొత్త బ్యాంక్ ఏర్పాటుకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం వలన మరింత మందికి బ్యాంకింగ్ సేవలు లభించనున్నాయి. ఇదిలా ఉంటే ఆర్‌బీఐ తాజాగా సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, భారత్ పే కన్సార్షియంకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటు కోసం ఆమోదం తెలిపింది.

అలానే బ్యాంకింగ్ లైసెన్స్ జారీ చేసింది. దీంతో ఇక కొత్త బ్యాంక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ బ్యాంక్ గురించి చూస్తే.. ఈ బ్యాంక్ పేరు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. తాజా కొత్త బ్యాంక్‌తో కలుపుకుంటే.. భారత్‌లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల సంఖ్య 12కు చేరిందని చెప్పుకోవచ్చు. దేశీ తొలి డిజిటల్ బ్యాంక్‌గా ఆవిర్భవిస్తామని అన్నారు. అలానే సెంట్రమ్, భారత్‌పే రెండూ కలిసి బ్యాంక్ నిర్వహణ బాధ్యతలు చూసుకోనున్నాయి అని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement