Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ RBI – రైత‌న్న‌ల‌కు శుభ‌వార్త – ఎటువంటి హామీ లేకుండానే రెండు లక్ష‌లు రుణం

RBI – రైత‌న్న‌ల‌కు శుభ‌వార్త – ఎటువంటి హామీ లేకుండానే రెండు లక్ష‌లు రుణం

0
RBI –  రైత‌న్న‌ల‌కు శుభ‌వార్త – ఎటువంటి హామీ లేకుండానే రెండు లక్ష‌లు రుణం

న్యూ ఢిల్లీ – రైతులకు ఆర్ బి ఐ శుభవార్త చెప్పింది..ఇకపై రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించింది రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా. చిన్న, సన్నకారు రైతులకు పెద్ద ఉపశమనం ఇచ్చేలా భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. చిన్న, సన్నకారు రైతులకు ఎలాంటి పూచీకత్తు లేకుండానే ఇచ్చేలా రుణాల పరిమితిని రూ. 1.60 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పెంచింది భారతీయ రిజర్వ్ బ్యాంక్.

ప్రస్తుత సమయంలో.. ఖర్చులు, ద్రవయోల్బణం, పెట్టుబడి ఇలా అనేక రకాల అంశాలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో చిన్న అలాగే సన్న కారు రైతులకు ఊరట కలిగించేందుకు రెండు లక్షల వరకు రుణాలు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన చేసింది. 2019 సంవత్సరంలో రుణ పరిమితిని లక్ష రూపాయల నుంచి 1.6 లక్షల వరకు పెంచింది. అయిదేళ్ల త‌ర్వాత రుణాన్ని రెండు ల‌క్ష‌ల‌కు హెచ్చించింది..

Exit mobile version