ముంబై – అదానీ గ్రూపు కంపెనీలకు ఇచ్చిన రుణాలకు సంబంధించిన వివరాలను అందించాల్సిందిగా స్ధానిక బ్యాంకులను ఆర్‌బీఐ కోరిందని సమాచారం. గత వారం నుంచి అదానీ గ్రూపు కంపెనీలు దాదాపు 100 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయిన క్రమంలో కేంద్ర బ్యాంక్ అప్రమత్తమైంది. అదానీ గ్రూపునకు బ్యాంకు రుణాలపై ఆర్‌బీఐ ఆరా తీస్తోందని బ్యాంకింగ్, ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించినా కేంద్ర బ్యాంక్ అధికారికంగా స్పందించలేదు. ఇన్వెస్టర్లలో విశ్వాసం కల్పించేందుకు గ్రూపు చీఫ్, బిలియనీర్ గౌతం అదానీ వీడియో స్టేట్‌మెంట్ వెల్లడించినా గురువారం సైతం షేర్స్ పతనం కొనసాగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement