ఫినో పేమెంట్స్ బ్యాంక్‌కు అంతర్జాతీయ మనీ ట్రాన్స్‌ఫర్ సేవలను అందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదం తెలిపింది. దీని ద్వారా తమ కస్టమర్‌లు విదేశాల నుంచి పంపిన నిధులను స్వీకరించడానికి వీలు కలుగుతుందని ఫినోపేమెంట్స్ బ్యాంకు చెప్పుకొచ్చింది. మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీస్ స్కీం (ఎంటీఎస్‌ఎస్) కింద అంతర్జాతీయ రెమిటెన్స్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆర్‌బీఐ నుంచి అనుమతి లభించిందని ఫినో బ్యాంకు ప్రకటించింది. రుణదాత.. ఓవర్సీస్ ప్రిన్సిపాల్‌తో కలిసి.. క్రాస్ బోర్డర్ మనీ ట్రాన్స్‌ఫర్ కార్యకలాపాలను చేపడ్తారు. అయితే వీటికి సంబంధించిన పూర్తి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తమ కస్టమర్ల కుటుంబ సభ్యులు చాలా మంది విదేశాల్లో పని చేస్తున్నారని, వారి కోరిక మేరకు ఈ సరికొత్త సదుపాయాన్ని తీసుకొచ్చామని ఫినో బ్యాంకు తెలిపింది.
విదేశాల నుంచి వారి కుటుంబ సభ్యులు పంపిన డబ్బును.. ఇప్పుడు సమీప మైక్రో ఏటీఎం లేదా ఇటీవల ప్రారంభించిన ఆధార్ ఇనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ (ఏఈపీఎస్) లేదా ఫినో బ్యాంక్ మర్చంట్ పాయింట్స్‌లో నేరుగా విత్‌డ్రా చేసుకోవచ్చని ఫినో పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మేజర్ ఆశిష్ అహుజా తెలిపారు. ఫినో మర్చంట్స్ కొత్త ఖాతా తెరవడం, నగదు డిపాజిట్, నగదు బదిలీ, విత్ డ్రా సేవలు మైక్రో ఏటీఎంలు, ఏఈపీఎస్ మెకానిజంల ద్వారా పొందొచ్చన్నారు. అంతర్జాతీయ చెల్లింపులతో తమ బ్యాంకు వ్యవస్థ మరింత బలోపేతం అయ్యిందన్నారు. బ్యాంకు ఆదాయాన్ని మరింత పెంచేందుకు ఎంతో సహాయపడుతుందని చెప్పుకొచ్చారు. గుజరాత్, పంజాబ్, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ప్రధాన ఇన్‌వర్ట్ రెమిటెన్స్ కారిడార్ ఉందని వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital