Saturday, November 23, 2024

RBI – ప్రింటింగ్ ప్రెస్ నుంచి 88వేల కోట్ల విలువైన రూ.500 నోట్ల మాయం…

ముంబై…ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 88వేలకు పైగా కోట్లు గల్లంతయ్యాయి. అవన్నీ కూడా. 500 నోట్లే. ప్రింట్ అయ్యాయి.. కానీ ఆర్బీఐకి చేరలేదు. అసలేమయ్యాయి. అయితే మనోరంజన్‌ రాయ్‌ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సేకరించిన గణాంకాల ద్వారా ఈ విషయం బయటపడింది. అయితే ఇండియాలో కరెన్సీ నోట్లను ముద్రించే యూనిట్లు మూడు ఉన్నాయి. అందులో ఒకటి బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (పి) లిమిటెడ్, నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్, మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఉన్న బ్యాంక్ నోట్ ప్రెస్ ఉంది..

ఈ మూడు మింట్‌లూ కొత్తగా డిజైన్‌ చేసిన రూ.500 నోట్లను 8,810.65 మిలియన్ల నోట్లను ముద్రించి సరఫరా చేశాయి. అయితే వీటిలో ఆర్బీఐకి చేరినవి 7,260 మిలియన్లు మాత్రమేనని మనోరంజన్‌ రాయ్ సమాచార హక్కు చట్టం కింద పొందిన గణాంకాలు చెబుతున్నాయి. అంటే రూ. 88,032.5 కోట్ల విలువైన 1,760.65 మిలియన్ల రూ.500 నోట్లు గల్లంతయ్యాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఆర్టీఐ గణాంకాల ప్రకారం.. 2016-2017లో నాసిక్ మింట్ 1,662 మిలియన్ నోట్లు, బెంగళూరు మింట్ 5,195.65 మిలియన్ నోట్లు, దేవాస్ మింట్ 1,953 మిలియన్ నోట్లను ఆర్‌బీఐకి సరఫరా చేసింది. మూడు మింట్‌ల నుంచి సరఫరా అయిన మొత్తం నోట్లు 8,810.65 మిలియన్లు. అయితే ఆర్బీఐకి అందినవి మాత్రం 7260 మిలియన్ నోట్లే.. దీంతో ఆ నోట్లు ఏమ‌య్యాయో ఇప్ప‌టి వ‌ర‌కు తెలీయ‌క‌పోవ‌డం విశేషం..

Advertisement

తాజా వార్తలు

Advertisement