మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. 1980 కాలంలో స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. కొత్త దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గోదావరి గట్టున పుట్టిన టైగర్ నాగేశ్వరరావు గజదొంగగా మొత్తం దేశాన్ని ఎలా గడగడలాడించాడు ఒక చిన్న టీజర్ తో మేకర్స్ చెప్పేశారు.
నాగేశ్వరరావు పాలిటిక్స్ లోకి వెళ్ళుంటే వాడి తెలివితేటలతో ఒక ఎలక్షన్ గెలిచేవాడు..
స్పోర్ట్స్ లోకి వెళ్ళుంటే వాడి పరుగుతో ఇండియా కి మెడల్ గెలిచేవాడు..
ఆర్మీ లోకి వెళ్ళుంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు.. అంటూ టీజర్ లో వినిపించిన మాటలు మూవీని హైప్ ని పెంచేలా ఉన్నాయి.
ఈ సినిమాలో హీరోయిన్స్ గా నుపూర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. ఇక చాలా గ్యాప్ తరువాత హీరోయిన్ రేణూ దేశాయ్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. తమిళ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.