Tuesday, November 12, 2024

Breaking: రవితేజ చేతికి సర్జరీ.. ఆరు వారాలు రెస్ట్..

మాస్ మహారాజ రవితేజకు సర్జరీ జరిగింది. ఇటీవల ఓ సినిమా చిత్రీకరణ సమయంలో అతడు స్వల్పంగా గాయపడ్డాడు. కుడిచేతికి గాయమైనప్పటికీ లెక్క చేయకుండా షూట్ కొనసాగించాడు. దురదృష్టవశాత్తూ నొప్పి తీవ్రతరం కావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు.

అతడిని పరీక్షించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. అనంతరం విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. హీరో రవితేజను ఆరువారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement