బిజెపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఏపీ మాజీ మంత్రి ..బిజెపి నేత రావెల కిశోర్ బాబు. రాజీనామా లేఖను ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపారు. తన వ్యక్తిగత కారణాలతోనే బీజేపీని వీడుతున్నానని, పార్టీ నేతలు అన్యథా భావించవద్దని ఆయన తన రాజీనామా లేఖలో విజ్ఞప్తి చేశారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న రావెల… కొన్ని నెలల నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా లేరు. కిశోర్ బాబు ఐఆర్ ఎస్ అధికారిగా పనిచేశారు. 2014 లో టీడీపీలో చేరారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గెలుపొందారు. గెలవడమే ఆలస్యం… మంత్రి పదవి కూడా లభించింది. చంద్రబాబు కేబినెట్‌లో సాంఘిక, గిరిజన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జరిగిన కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి పోయింది.2019 ఎన్నికల సమయంలో టీడీపీకి గుడ్ బై చెప్పేసి, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరారు. ప్రత్తిపాడు నుంచి జనసేన పక్షాన బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. మళ్లీ… సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బీజేపీలో చేరారు. కొన్ని రోజులు ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేసేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement