Friday, October 18, 2024

TG | మాదాపూర్‌లో రేవ్ పార్టీ.. రియల్టర్లు, విద్యార్థులు అరెస్ట్

మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన రేవ్ పార్టీని తెలంగాణ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీవి వ‌చ్చిన‌ 14 మంది యువకులతో పాటు ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు పార్టీ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

అయితే, ఈ రేవ్ పార్టీలో ఒక గ్రాము కొకైన్, రెండు గ్రాముల ఎండీఎంఏ, డ్రగ్స్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1.25 లక్షల విలువైన మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బేగంపేటకు చెందిన నాగరాజు పుట్టినరోజు సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఈవెంట్ ప్రమోటర్ కిషోర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement