Friday, November 22, 2024

Ration Scam … ప‌శ్చిమ బెంగాల్ మంత్రి అరెస్ట్

కోల్ క‌తా – పశ్చిమ్ బెంగాల్ అటవీ శాఖ మంత్రి, టీఎంసీ నేత జ్యోతిప్రియో మల్లిక్ ను శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అదుపులోకి తీసుకుంది. రేషన్‌ స్కామ్‌లో 20 గంటలు ప్రశ్నించిన తర్వాత తెల్లవారుజామున ఆయన్ను అరెస్టు చేసింది. జ్యోతిప్రియో బెంగాల్ ప్రభుత్వంలో ఆహార మంత్రిగా ఉన్న సమయంలో రేషన్ పంపిణీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మల్లిక్‌కు చెందిన కోల్‌కతాలోని రెండు ఫ్లాట్లలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

మంత్రి మాజీ వ్యక్తిగత సహాయకుడి నివాసంతో పాటు మొత్తం 8 ఫ్లాట్లలో తనిఖీలు జరిపినట్లు ఈడీ వెల్లడించింది. అలాగే వారిని ప్రశ్నించింది. 20 గంటల పాటు ప్రశ్నించిన అనంతరం మంత్రిని తన ఇంట్లో అరెస్టు చేసి, ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆ సమయంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లను మోహరించారు. ‘నేను కుట్రలో బాధితుడిని’ అని తనను అదుపులోకి తీసుకున్న సమయంలో మంత్రి వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement