కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 21వరకు లాక్‌డౌన్ విధించింది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోలు ఉచితంగా రెండు నెలలపాటు ఇస్తోంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక్కొక్కరికి 5కిలోలు అందజేయాలని నిర్ణయించింది. మే, జూన్ నెలల పాటు ఈ రేషన్ అమల్లో ఉండనుంది.
ఈ సారి రేషన్ బియ్యం పంపిణీ మూడు రోజులు ఆలస్యంగా మొదలైంది. సాధారణంగా ప్రతి నెల 1నుంచి 15వరకు ఇస్తారు. అయితే ఈ నెల మాత్రం 20వరకు రేషన్ పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆయా జిల్లాల్లో ఉన్న లబ్ధిదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాలో 18 వరకు, మరికొన్ని జిల్లాల్లో 20 వరకు ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ అనుమతి ఇచ్చింది.