భారత్లో జీడీపీ వృద్ధిరేటు అంచనాలను ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ 8.5శాతంగా పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 10.3 నుంచి 8.5శాతానికి పరిమితం అవుతుందని మంగళవారం పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం వల్ల నిత్యావసర వస్తువులు పెరుగుతాయని తెలిపింది. 180బేసిస్ పాయింట్లను తగ్గించి 8.5శాతానికి ఫిచ్ సవరించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ ప్రభావం భారత ఆర్థికవ్యవస్థపై ఉంటుందని పేర్కొంది.
అయితే ఎఫ్వై22 రేటింగ్ ఎజెన్సీ డిసెంబర్ అంచనా కంటే 8.7శాతానికి 60బేసిస్ పాయింట్లను పెంచింది. కాగా ఆర్బీఐ ఎఫ్వై23 అంచనాల కంటే ఫిచ్ రేటింగ్ అంచనా ఎక్కువగా ఉంది. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 7.8శాతం పెరుగుతుందని ఆర్బీబీ భావిస్తోంది. ఈ సంవత్సరం వృద్ధిరేటును కేంద్ర బ్యాంకు 8.9శాతంగా పేర్కొంది..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..