Friday, November 22, 2024

Ratan Tata | అత‌నికి 10 కోట్లా.. కొట్టిపారేసిన ర‌త‌న్ టాటా

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ ప్ర‌పంచ కప్‌లో భాగంగా ఇటీవల చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అప్ఘానిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే వన్డే మ్యాచ్ ల్లో పాకిస్థాన్‌పై అప్ఘాన్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. 280కిపైగా పరుగుల లక్ష్యాన్ని అప్ఘానిస్థాన్ సునాయాసంగా చేధించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక‌, ఈ మ్యాచ్ అనంత‌రం అఫ్గాన్ క్రికెట‌ర్లు గెలుపు సంబ‌రాలు చేసుకున్నారు. ఈ స‌మ‌యంలో ర‌షీద్ ఖాన్ భార‌త జెండా ప‌ట్టుకుని క‌నిపించాడ‌ట‌. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రషీద్‌కు రూ.55 లక్షల జరిమానా విధించినట్లు పలు సోషల్ మీడియా ఖాతాల్లో వార్తలు వైరల్ అయ్యాయి.

క్రికెటర్ రషీద్ ఖాన్‌కు ఐసీసీ జరిమానా విధించ‌డంతో.. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా రూ.10 కోట్లు ఇస్తానని ప్రకటించారనే ప్రచారం జోరుగా సాగింది. ఇక‌, ఈ పది కోట్ల వ్యవహారం వైరల్‌గా మారడంతో చివరకు రతన్ టాటా స్పందించాల్సి వచ్చింది.

- Advertisement -

ఈ విష‌యంపై ఎక్స్‌(ట్విట్ట‌ర్) వేదిక‌గా ర‌త‌న్ టాటా స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదు. తాను ఏ క్రికెటర్‌కు కూడా రివార్డు ప్రకటించలేదని ఆయ‌న తెలిపారు. ఇలాంటి వార్తలను నమ్మవద్దని అన్నారు. అలాంటిదేమైనా ఉంటే తన అధికారిక సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా వెల్లడిస్తానని రతన్ టాటా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement