తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా వేమునూరు పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ తండాకు వాసి భూక్య రెడ్యా అనే రైతు కు చెందిన రెండు లక్షల రూపాయలను ఎలుకలు కొరికిన వార్త సంచలంనగా మారిన సంగతి అందరికి తెలిసిందే. కడుపులో కణితి ఆపరేషన్ కోసం బీరువాలో దారుచుకున్న రూ.2 లక్షల కరెన్నీ నోట్లను ఎలుకలు ముక్కలు ముక్కలుగా కొరికేశాయి. అయితే ఇప్పుడు ఆ నోట్లను అధికారులు ఆర్‌బీఐకి పంపించారు. కలెక్టర్ గౌతమ్ ఆదేశాల మేరకు సోమవారం ఆ కరెన్సీ నోట్లను హైదరాబాద్‌లోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కార్యాలయానికి పంపి నట్లు తహసీల్దార్ రంజిత్‌కుమార్ తెలిపారు. రైతు భూక్యా రెడ్యాతో పాటు వీఆర్‌ఏ కత్తుల రాజశేఖర్‌ను హైదరాబాద్‌కు పంపించి ఎలుకలు కొరికిన కరెన్సీ నోట్లను ఆర్‌బీఐ అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. తదుపరి ఆదేశాలు వచ్చాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.
చికిత్స కోసం దాచుకున్న నగదును ఎలుకలు కొట్టడంతో తీవ్ర బాధలో ఏం చేయాలో దిక్కుతోచని రైతు రెడ్యాకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అండగా నిలిచారు. రెడ్యాకు మంత్రి సత్యవతి ఫోన్ చేసి మాట్లాడారు. రెడ్యా దాచుకున్న డబ్బులను తిరిగి ఇప్పిస్తానని, ఆయన కోరుకున్న చోట మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎమ్మార్వో రంజిత్‌ని రైతు రెడ్యా దగ్గరకు పంపించి, ధైర్యం చెప్పారు. కాగా ఇప్పుడు ఆ నోట్లను ఆర్బీఐకి పంపడంతో అధికారులు ఏం చేస్తారాని అందరిలోను ఉత్కంఠ మొదలయింది.
ఇది కూడా చదవండి: రాజ్ కుంద్రా న్యూడ్ గా ఆడిషన్ అడిగాడు: నటి సాగరిక సోనా