టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన. అగ్ర హీరోల సరసన వరుస ఛాన్సులు కొట్టేస్తూ, స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి.. బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ. అనతికాలంలోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక మందన.. ఇటీవలే తమిళంలో ‘సుల్తాన్’ సినిమాతో తమిళ ప్రేక్షకులను కూడా దగ్గరైంది.. తాజాగా పెళ్లిపై తన మనసులో మాట బయటపెడుతూ అసలు విషయం చెప్పేసింది క్రేజీ బ్యూటీ రష్మిక మందన. తమిళుల గురించి కొన్ని విషయాలు చెప్పిన రష్మిక.. తనకు తమిళ సంప్రదాయం, సంస్కృతి చాలా బాగా నచ్చిందని చెప్పింది. ముఖ్యంగా అక్కడి భోజనం, వంటలు చాలా రుచికరంగా ఉన్నాయని, అందుకే ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలన్నదే తన కోరిక అని పేర్కొంది. తమిళ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది రష్మిక.
గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం నడిపిన రష్మిక.. అతనితో నిశ్చితార్థం కూడా చేసుకొని చివరకు బ్రేకప్ చెప్పింది. అందుకు కారణాలేంటనేవి పెద్దగా బయటకురానప్పటికీ మళ్ళీ ఇలా రష్మిక పెళ్లి మ్యాటర్ తీసుకురావడంతో సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా, ప్రస్తుతం అల్లుఅర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది రష్మిక. ఇక బాలీవుడ్ లో డెడ్లీ, మిషన్ మజ్ను వంటి వరుస సినిమాలలో నటించనుండగా.. హిందీలో మరో అవకాశాన్ని కూడా అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ తో ప్లాన్ చేస్తున్న సుకుమార్ సినిమాల్లో కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.