Tuesday, November 26, 2024

ప్ర‌పంచ నేత‌లారా..నా దేశాన్ని రక్షించండి: ర‌షీద్ ఖాన్

ఆఫ్ఘనిస్తాన్‌లో భయకరంగా మారుతోంది. ఒక్కొక్క ప్రాంతాన్నీ తాలిబన్లు ఆక్రమించుకుంటున్నారు. ఆప్ఘన్ సైన్యానికి, తాలిబన్లకు మధ్య యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి అమెరికా ద‌ళాలు వెన‌క్కి వెళ్తుండ‌టంతో మ‌రోసారి ఆ దేశం మెల్ల‌గా తాలిబ‌న్ల గుప్పిట్లోకి వెళ్తోంది. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబ‌న్లు త‌మ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆఫ్ఘ‌న్ సైన్యం, తాలిబ‌న్ల మ‌ధ్య యుద్ధం సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను బ‌లి తీసుకుంటోంది. త‌మ దేశం రావ‌ణ‌కాష్టంగా మారుతుండ‌టాన్ని చూసి త‌ట్టుకోలేక‌పోతున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్.. త‌మను ఇలా గంద‌ర‌గోళంలో వ‌దిలేయ‌కండి అని ప్ర‌పంచ నేత‌లను వేడుకుంటున్నాడు. బుధ‌వారం అత‌డు ట్విట‌ర్ ద్వారా త‌న గోడు వెల్ల‌బోసుకున్నాడు.

ప్ర‌పంచ నేత‌లారా! మా దేశం గంద‌ర‌గోళంగా ఉంది. పిల్ల‌లు, మ‌హిళ‌లు స‌హా వేల మంది ప్ర‌తి రోజూ మృత్యువాత ప‌డుతున్నారు. ఇళ్లు, ఆస్తుల విధ్వంసం జ‌రుగుతోంది. వేలాది కుటుంబాలు చెల్లాచెదుర‌య్యాయి. మ‌మ్మ‌ల్ని ఇలా గంద‌ర‌గోళంలో వ‌దిలేయ‌కండి. ఆఫ్ఘ‌న్ల హ‌త్య‌ల‌ను, ఆఫ్ఘనిస్థాన్ విధ్వంసాన్ని ఆపండి. మాకు శాంతి కావాలి అని ర‌షీద్ ఖాన్ ఎంతో ఆవేద‌న‌తో ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లోని 65 శాతం భూభాగం మ‌ళ్లీ తాల‌బన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది.

ఇక ఈ క్రమంలో అక్కడున్న భారతీయుల భద్రతపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇప్పుడు తాలిబన్లు మజర్ ఎ షరీఫ్ నగరం వైపుకు దూసుకొస్తున్నట్టు తెలియడంతో..కేంద్ర ప్రభుత్వం(Central government)హెచ్చరికలు జారీ చేసింది. ఆప్ఘన్‌లో ఉన్న భారతీయులు తక్షణం ఇండియాకు రావాలని పిలుపునిచ్చింది. అక్కడున్న దౌత్య కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. సిబ్బందిని ప్రత్యేక విమానంలో ఇండియాకు రప్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement