ఆఫ్ఘనిస్థాన్‌లో రాజకీయంగా అనిశ్చితి నెలకొంది. తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించేశారు. నేపథ్యంలో అక్కడి క్రికెటర్లు ఐపీఎల్లో ఆడతారో లేదో అన్న సందిగ్ధం నెలకొంది. అయితే తమ టీమ్‌కు ఆడాల్సిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీ మాత్రం యూఏఈలో జరిగే ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటారని సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్రకటన చేసింది. ఆప్ఘనిస్తాన్‌లో ఏం జరుగుతుందో తమకు సంబంధం లేదని, కానీ రషీద్ ఖాన్, నబీ మాత్రం టోర్నీకి అందుబాటులో ఉంటారని టీమ్ సీఈవో షణ్ముగం స్పష్టం చేశారు. ఈ నెల 31న తమ టీమ్ యూఏఈకి బయలుదేరుతోందని షణ్ముగం వెల్లడించారు.
కాగా ప్రస్తుతం రషీద్ ఖాన్, మహ్మద్ నబీ ఇద్దరు ఆటగాళ్లు వేరే టోర్నీలో ఆడేందుకు యూకేలో ఉన్నారు. అయితే తన కుటుంబాన్ని ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఎలా బయటపడేయాలన్నదానిపై రషీద్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ చెప్పాడు. కాబూల్ ఎయిర్‌స్పేస్ మూసేయడంతో అక్కడి నుంచి వివిధ దేశాలకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ వార్త కూడా చదవండి: రెండో టెస్టులో డ్రా కోసం పోరాడుతున్న భారత్